
* ధర్మస్థలి కేసులో మరో మలుపు
ఆకేరు న్యూస్ , డెస్క్ : కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రం ధర్మస్థలిలో వందల మృతదేహాల ఖననం ఆరోపణల కేసు మరో మలుపు తిరిగింది. మృతదేహాలను పలు ప్రదేశాల్లో పాతి పెట్టినట్లు ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తిని సిట్ బృందం అదుపులోకి తీసుకున్నది.స్పెషనల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ చీఫ్ ప్రణబ్ మోహంతి ఆ ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తిని ప్రశ్నిస్తున్నారు. ఫిర్యాదుదారుడి పేరును అధికారులు వెల్లడించలేదు. అతను ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలు, డాక్యుమెంట్లకు పొంతన లేదని, అందుకే అతన్ని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మాయమాటలతో మొత్తం వ్యవస్థను నమ్మించి చివరికి ఏమీ తెలియదని చేతులు ఎత్తేశాడని ఈ దర్యాప్తులో విచారణ బృందం గుర్తించింది. నేడు ఆ వ్యక్తిని కోర్టులో హాజరుపర్చనుంది.
అనన్యభట్ అనే మహిళ లేదా..?
దర్మస్థలిలో అనేక వందల మంది మహిళల మృతదేహాల ఖననం అనే అంశం తెరపైకి రావడంతో సుజాత భట్ అనే మహిళ తన కుమార్తె అనన్య భట్ 2023లో తన స్నేహితులతో కలిసి ధర్మస్థలికి వెళ్లిందని అప్పటి నుంచి ఆమె కన్పించడం లేదని అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోకుండా తననే బెదిరించారంటూ ఇటీవలే ఆరోపించింది. దీంతో పోలీసులు ధర్మస్థలి కేసులో భాగంగానే అనన్య మిస్సంగ్ కేసు ను దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో అనన్య భట్ తల్లి సుజాత భట్
నిన్న తాను చెప్పింది నిజం కాదని తనకు అసలు కూతురే లేదని ధర్మస్థలి కేసుతో సంబందం ఉన్న ఇద్దరు వ్యక్తులు తనతో అలా చెప్పంచారు మీడియాకు చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. అనన్య మిస్సింగ్ అంటూ వచ్చిన ఫొటోలు కూడా సృష్టించినవే అని ఆమె చెప్పడం గమనార్హం. పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చి తాను తప్పు చేశానని తన తప్పును సరిదిద్దుకోవడాని ఇప్పుడు నిజం చెప్తున్నానని ఆమె పేర్కొంది. ప్రజలు ధర్మస్థలి భక్తులు తనను క్షమించాలని సుజాత భట్ మీడియా ద్వారా కోరుకుంది. దీంతో పోలీసులు సుజాత భట్ ను కూడా విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
…………………………….