
* 23 మంది మావోయిస్టుల హతం
ఆకేరున్యూస్, ఛత్తీస్గఢ్: తెలంగాణ – ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య భీకరకాల్పులు జరిగాయి. వివరాలు.. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా కర్రెగుట్టల్లో గత రెండు వారాల పైగా వేల సంఖ్యలో భద్రతా దళాలు మావోయిస్టుల వేటలో నిమగ్నమయ్యాయి.. ఈ క్రమంలోనే ఇప్పటివరకు సుమారు పదిమంది మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. కాగా బుధవారం ఉదయం బీజాపూర్ జిల్లాలోని కర్రెగుట్ట ప్రాంతాల్లో సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న భద్రతా దళాలకు మావోయిస్టులు తారాసపడగా.. ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇప్పటివరకు 23 మంది మావోయిస్టులు నేలకొరిగినట్లు సమాచారం. ఘటనాస్థలం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
…………………………….