* పలువురు అగ్రనేతల మృతి
ఆకేరు న్యూస్, డెస్క్ : మారేడుమిల్లి లో మంగళవారం ఉదయం భారీఎన్‌కౌంటర్ జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా టైగర్ జోన్లో కేంద్ర బలగాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు కొనసాగాయి. ఎన్‌కౌంటర్‌కు సంబంధించి డీజీపీ హరీష్‌కుమార్ వివరాలు వెల్లడించారు. లోతట్టు అటవీప్రాంతంలో అగ్రనేతలు ఉన్నారనే సమాచారం అందింది. దీంతో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. మంగళవారం ఉదయం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగినట్లు తెలిపారు. ఆరుగురు మావోలు మృతి చెందినట్లు చెప్పారు. మృతుల్లో మావోయిస్ట్ పార్టీ అగ్రనేత ఉన్నట్లు పేర్కొన్నారు. సంఘటనా స్థలంలో తుపాకులు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. పాడేరు ఏజెన్సీలో హై అలర్ట్ ప్రకటించారు. పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. మావోయిస్ట్ పార్టీ కీలక నేత హిడ్మా దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గా పని చేస్తున్నారు..ఆయన మీద ప్రభుత్వం కోటి రూపాయల రివార్డ్ ప్రకటించింది..ఆయనతో పాటు ఎన్ కౌంటర్ ఆయన భార్య నలుగురు కీలక నేతలు ఉన్నట్లు గా సమాచారం..
……………………………………………….
