
* 20 మంది సజీవ దహనం
ఆకేరున్యూస్ : చైనాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ నర్సింగ్ హోమ్‌లో మంటలు చెలరేగడంతో 20 మంది సజీవ దహనమయ్యారు. ఈ ఘటన హెబీ ప్రావిన్స్లోచోటు చేసుకుంది. రాజధాని బీజింగ్‌కు 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెంగ్డే నగరంలోని లాంగ్హువా కౌంటీలో గల ఓ నర్సింగ్ హోమ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో మంటల ధాటికి అందులో ఉన్న 20 మంది సజీవదహనమయ్యారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు.
………………………………