
* బీరువా నుంచి కోటి రూపాయలు ఎత్తుకెళ్లిన దుండగులు
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : అబ్దుల్లాపూర్ మెట్ లో భారీ దోపిడీ జరిగింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కి చెందిన బ్రిలియంట్ ఇంజనీరింగ్ కళాశాల నుంచి దొంగలు కోటి రూపాయల నగదు దోచుకెళ్లారు. కాలేజి లోని లాకర్స్ ను బ్రేక్ చేసి డబ్బును దోచుకెళ్లారు. పోలీసులకుయ ఎలాంటి క్లూస్ దొరకకుండా 200 సీసీ కెమెరాలు ఉన్న డీవీఆర్ని దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ నేపధ్యంలో పోలీసులు కాలేజీ సమీపంలో ఉన్న సీసీ కెమరాలను పరిశీలిస్తున్నారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఫిర్యాదు మేరకు అబ్దుల్లా పూర్ మెట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. విరారణలో భాగంగా కాలేజిలో కూడా విచారణ జరుపుతున్నారు.
……………………………………