
* మొత్తం 14,236 పోస్టుల భర్తీకి రంగం సిద్దం
ఆకేరున్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలోని మహిళా శిశు సంక్షేమ శాఖలో కొలువుల జాతర మొదలైంది. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల ఖాళీల భర్తీకి ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చేసింది. ఖాళీల భర్తీకి సంబంధించిన ఫైల్ మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి సీతక్క సంతకం చేశారు. మొత్తం 6399 అంగన్వాడీ టీచర్లు, 7837 హెల్పర్ల పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. ఎన్నికల కోడ్ ముగియగానే నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉంది. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పోస్టుల భర్తీకి సంబంధించి ఆయా జిల్లాల కలెక్టర్లు నోటిఫికేషన్‌ను జారీ చేయనున్నారు. మొత్తం 14,236 పోస్టులను తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేయనుంది. తెలంగాణలో ఈ స్థాయిలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల కొలువులను భర్తీ చేయడం ఇదే తొలిసారి. ఖాళీల భర్తీ ప్రకియతో అంగన్వాడీలు మరింత పటిష్టంగా పనిచేయనున్నారు.
………………………………….