
* వైద్యులు సమయ పాలన పాటించాలి
* జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్
ఆకేరు న్యూస్, ములుగు: ప్రస్తుతం వర్షాలు పడుతున్నందున సీజనల్ వ్యాధులు, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందని, నియంత్రణ చర్యలు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ సూచించారు. శుక్రవారం ములుగు జిల్లా మల్లంపల్లి మండలంలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సెంటర్ ను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకొని, వర్షాకాలంలో వైద్య ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఆయుష్మాన్ ఆరోగ్యం మందిర్ కు వచ్చే జ్వర పిడుతులకు ఏ ఏ పరీక్షలు చేస్తున్నారని, మందుల నిల్వలు సరిపడే విధంగా ఉన్నాయ అంటూ, వివరాలు అడుగగా, ఆయుష్మాన్ ఆరోగ్యం మందిర్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ డాక్టర్. శ్రవణ్ కుమార్ జ్వరంతో బాధపడుతున్న ప్రతి వ్యక్తికి మలేరియా డెంగ్యూ ఆర్డిటి పరీక్షలు చేస్తున్నామని, దానితోపాటు దోమల నియంత్రణ చర్యలపై కూడా అవగాహన కల్పిస్తున్నామని, పెద్దవారికి టాబ్లెట్స్, చిన్నపిల్లలకు పౌడర్ రూపంలో ఉన్న మందులను చికిత్సగా ఇస్తున్నామని కలెక్టర్ కు వివరించారు. ఆయుష్ సెంటర్ కు ఎటువంటి సమస్యలతో ఆయుష్ సెంటర్కు ప్రజలు వస్తున్నారని వివరాలు అడిగి తెలుసుకోగా, చర్మవ్యాధులు, కీళ్ల నొప్పులు, అనోరెక్టల్, సాధారణ జబ్బులతో ఎక్కువ వస్తున్నారని వారికి చికిత్సలు జేస్తున్నామని తెలిపారు. ఆశా కార్యకర్తలు ఫీవర్ సర్వే చేయాలని ప్రతిరోజు 20 ఇంటింటిని సందర్శించిస్తు దోమల నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పింస్తున్నమని వైద్య సిబ్బంది వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయుష్మాన్ ఆరోగ్యం మందిర్ డాక్టర్ శ్రవణ్ కుమార్, ఆయుష్ డాక్టర్ సంధ్య ఫార్మసిస్ట్ ఉషారాణి, ఆరోగ్య కార్యకర్తలు మంజుల, వసంత, ఆశా కార్యకర్తలు సుధారాణి, రేణుక, రజిత, సుజాత తదితరులు పాల్గొన్నారు.
………………………………………….