* నార్లాపూర్ పరిసరాలలో కార్డెన్ సర్చ్
* సిఐ దయాకర్
ఆకేరు న్యూస్, ములుగు: మేడారం మహా జాతరను పురస్కరించుకొని జాతర పరిసరాలలో నేరాల నియంత్రణకు ముందస్తు జాగ్రత్త చర్యలలో భాగంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించి చర్యలు తీసుకుంటున్నామని పసర సీఐ దయాకర్ తెలిపారు. ఆదివారం. తాడ్వాయి మండలంలోని నార్లాపూర్ పరిసరాలలో కొత్తగా రెండు రోజుల క్రితం ఏర్పాటయిన గుడిసెలలో పోలీసులు కార్డెన్ సర్చ్ నిర్వహించారు. జిల్లా పోలీసు అధికారుల ఆదేశాల మేరకు సిఐ దయాకర్ ఆధ్వర్యంలో సిసిఎస్ సిఐ బండారి కుమార్, తాడ్వాయి ,పసర ఎస్సైలు , కమలాకర్ ,శ్రీకాంత్ రెడ్డి, ప్రొహిబిషనరీ ఎస్ఐలు మధుకర్, సతీష్ ఆంజనేయులు, ఎర్రయ్య సిసిఎస్ పోలీసులు పస్రా మేడారం తాడ్వాయి సివిల్ పోలీసు సిబ్బంది తో అనుమానితులను ఫింగర్ ప్రింట్ డివైస్ ద్వారా చెక్ చేశారు .మూడు నెలల ముందే మేడారం పరిసర ప్రాంతాలలో గుడిసెలు వేసుకొని ఉండడం జాతకాలు చెప్తామని అమాయక ప్రజలను డబ్బులు తీసుకొని మోసం చేస్తున్నారని సమాచారం మేరకు అందరిని తనిఖీ చేయడం జరిగిందని తెలిపారు. వీరందరూ కూడా వేములవాడ సిరిసిల్ల మరియు అరండల్ కాలనీ ప్రాంతాలకు చెందిన వారని మేడారం పరిసర ప్రాంతాలలో నేరాల నివారణ కోసం ఇలాంటి ఆకస్మిక తనిఖీలు చేయడం జరుగుతుందని తెలిపారు.
………………………………………..
