
* వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
ఆకేరు న్యూస్ ,హనుమకొండ: ప్రజా రవాణాకు ఇబ్బంది లేకుండా చూడటమే
ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు
నాయిని రాజేందర్ రెడ్డి గారు అన్నారు. ములుగు రోడ్డులో ఇటీవల ఏర్పడిన
గుంతలు, పాక్షికంగా దెబ్బతిన్న రహదారులపై శాశ్వత పరిష్కార చర్యలు
తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ రోజు ఆయన
ములుగు రోడ్డు వద్ద గుంతల పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించి, వెంటనే
మరమ్మతులు చేపట్టాలని సూచించారు. ప్రజలకు అనవసరమైన
ఇబ్బందులు కలగకుండా, రహదారి మరమ్మతులను వేగంగా పూర్తిచేయాలని
అధికారులను ఆదేశించారు.అదే విధంగా, కూడలిలో రోడ్డు విస్తరణ
మరియు సీసీ రోడ్డు ఏర్పాటు అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో
ప్రత్యేకంగా చర్చించారు. రానున్న రోజుల్లో ప్రజలకు మెరుగైన రవాణా
సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే
తెలిపారు.
………………………………….