
Ninniu champestham.. We are going to kill you.. threaten call to MP Raghu nandan Rao
* బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు ఆగంతకుడి ఫోన్ కాల్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బీజేపీ ఎంపీ రఘునందన్ రావు(MP Raghunandan rao)కు ఆగంతుకుడి బెదిరింపు ఫోన్ కాల్ కలకలం రేపుతోంది. మెదక్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న రఘునందన్ రావుకు 9404348431 నంబర్ నుంచి ఆగంతుకుడు ఫోన్ చేశాడు. హైదరాబాద్లోనే ఉన్నాం.. సాయంత్రంలోగా నిన్న చంపేస్తాం.. అని గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారు. ఈ నేపథ్యంలో రఘునందన్ రావు భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంపీ రఘునందన్ రావుకు ఇలాంటి కాల్స్ రావడం కొత్తేం కాదని, ఇది ఆరోసారని పేర్కొంటున్నారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
……………………………………………