ఆకేరు న్యూస్,ములుగు:మేడారం శ్రీ సమ్మక్క-సారలమ్మ మహా జాతర భక్తజన సంద్రమై వర్ధిల్లుతోంది. మాజీ మంత్రి, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి దయాకర్ రావు అమ్మవార్లను దర్శించుకొని తన బరువుకు సమానమైన బెల్లాన్ని అమ్మవార్లకు కానుకగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.ఈ కార్యక్రమంలో ఎర్రబెల్లితో పాటు పలువురు బిఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అమ్మవార్ల గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని వారు ప్రార్థించారు.మేడారం జాతర సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. రాజకీయ ప్రముఖుల రాకతో గద్దెల పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది…
………………………………………….…………
