ఆకేరు న్యూస్, ములుగు: మేడారం సమ్మక్క సారమ్మ మహా జాతరకు వచ్చే భక్తుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, రద్దీ నిర్వహణ, ఎలాంటి అనూహ్య సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు పాత్ర పోషించే సీసీటీవీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. జాతర సమయంలో భారీగా రద్దీ దృశ్య ప్రధాన ప్రాంతాలైన జంపన్న వాగు గద్దెలు, హరితా వై జంక్షన్, ముఖ్య ట్రాఫిక్ మార్గాలు కూడళ్ళు, రద్దీ ప్రాంతాలు తదితర కోర్ పాయింట్లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు.
ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి దృష్ట్యా ఈ సారి మునుపటి కన్నా ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున భద్రతను బలోపేతం చేసే దిశగా జాతర మొత్తాన్ని సీసీటీవీ నిఘాలో ఉండే విధంగా సీసీటీవీ లు అమర్చారు. సి సి టీవీలు పోలీస్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేశారు .ఏ ప్రాంతంలో ఏ సంఘటన జరిగిన పోలీసులు అప్రమత్తమై పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని పోలిసులు భక్తులకు భరోసా కల్పిస్తున్నారు.
………………………………………………………..
