ఆకేరు న్యూస్, ములుగు: వచ్చేనెల లో ఆసియా ఖండంలోని ఆదివాసి సంస్కృతి సంప్రదాయాలతో జరుగు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర పోస్టర్ ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆదివారం ఆవిష్కరించారు. ఇందులో భాగంగా ఆదివాసి ఇలవేల్పులు సమ్మక్క సారలమ్మ జాతరకు ముఖ్యమంత్రి తోపాటు రాష్ట్ర మంత్రివర్గం మేడారం మహా జాతరకు రావాలంటూ తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఆహాన పత్రాన్ని ముఖ్యమంత్రికి అందించి ఆవిష్కరించారు. జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో మేడారం మహా జాతర-2026 పోస్టర్ ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆఆవిష్కరించారు. జనవరి 28 నుంచి 31 వరకు జరుగు మేడారం మహా జాతరకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో
రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. మేడారం జాతర దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
………………………………………….

