–50 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు
— మెడికల్ ఆఫీసర్లు 150 మంది
–స్టాప్ 500 మంది సిబ్బంది.
30 క్యాంపులు.
–జాతరలో 38 అంబులెన్సులు.
–40 బైక్ అంబులెన్సులు.
– ములుగు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గోపాలరావు
ఆకేరు న్యూస్, ములుగు: ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతర ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు ఈనెల 28 నుంచి 31 వరకు జరిగే మహా జాతరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చిన ఎమర్జెన్సీగా మేడారంలోని కల్యాణ మండపంలో ఉన్న వైద్య ఆరోగ్య కేంద్రంలో 50 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేసినట్లు ములుగు జిల్లా వైద్యాధికారి గోపాల్ రావు తెలిపారు. ఈ జాతరలో 50 మంది స్పెషలిస్టు డాక్టర్ల సే వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని,150 మంది మెడికల్ ఆఫీసర్లు 500 మంది స్టాప్ 30 క్యాంపులు జాతరలో ప్రధాన కూడలిలో ఏర్పాటు చేయనున్నామని ఆయన తెలిపారు. భక్తులకు ఇలాంటి అత్యవసర పరిస్థితులలో ఎమర్జెన్సీగా అంబులెన్స్‌లను 38 ఏర్పాటు చేసినట్లు చేశామని. అత్యవసర పరిస్థితిలో జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తిన వెంబటే ప్రమాదం జరిగిన చోటుకు బైక్ కంప్లైంట్స్ ల ద్వారా వెళ్లి ప్రథమ చికిత్స నిర్వహించేందుకు బైకు అంబులెన్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాతరకు వచ్చే భక్తులకు ప్రమాదవశాత్తు ఏమి జరగకుండా తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుందని ఆయన అన్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి సునాయాసంగా అమ్మవారిని దర్శించుకుని సురక్షితంగా తిరిగి వెళ్లాలని కోరారు.
…………………………………………………………………
