* మహా జాతర విధి నిర్వహర్వణ పై సెక్టార్స్ అధికారులకు శిక్షణ.
ఆకేరు న్యూస్,ములుగు: మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర ను జోనల్, సెక్టార్స్ అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి అన్నారు.
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మేడారం జాతరను పటిష్టంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలో భాగంగా మేడారం జాతర లో విధులు నిర్వహించనున్న జోనల్, సెక్టార్స్ అధికారులకు గురువారం మేడారం హరిత హోటల్ లో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సంపత్ రావు తో కలసి శిక్షణ ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడారం జాతర ప్రాంతాన్ని సమగ్రంగా 12 జోన్లుగా విభజించి, వాటికి సంబంధించిన 62 మంది జోనల్ అధికారులకు, అలాగే 51 సెక్టార్లకు చెందిన 179 మంది సెక్టార్ అధికారులకు నియమించడం జరిగినదని తెలిపారు. జాతర సమయంలో చేపట్టాల్సిన బాధ్యతలు, నిర్వహణ విధానం, ప్రజల భద్రత, రవాణా నియంత్రణ, పారిశుద్ధ్యం, వైద్య సదుపాయాలు తదితర అంశాలపై అధికారులకు స్పష్టమైన అవగాహన కల్పించారు. శిక్షణ కార్యక్రమంలో భాగంగా ప్రతి అధికారికి స్పష్టమైన మార్గదర్శకాలతో కూడిన ఎస్ ఓ పి మాన్యువల్‌ను అందజేశామని అదనపు కలెక్టర్ తెలిపారు. జాతర సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు పక్క ప్రణాళికతో ముందుకు సాగాలని ఆయన సూచించారు. జాతర నిర్వహణలో ఆధునిక సాంకేతికతను వినియోగించనున్నట్లు తెలిపారు. డ్రోన్ సర్వైలెన్స్ ద్వారా జనసందోహాన్ని పర్యవేక్షించడంతో పాటు, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అధికారులకు మాస్టర్ కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తామని అన్నారు. దీంతో సమస్యలు తలెత్తిన వెంటనే గుర్తించి, తక్షణమే పరిష్కరించే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. జంపన్న వాగు ప్రాంతం లో జన సందోహం ఎక్కువగా ఉంటుందని, అధికారులు అప్రమంతగా ఉండాలని, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా 3 షిఫ్టుల్లో గజ ఈతగాళ్లు సిద్ధంగా ఉండే విధంగా చూసుకోవాలని అన్నారు. వివిధ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ జాతరను విజయవంతం చేయాలని, ప్రతి అధికారి తనకు కేటాయించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జోనల్, సెక్టార్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
…………………………………………..

