ఆకేరు న్యూస్, ములుగు: ఆదివాసీలు ఆరాధ్య దైవమైన సమ్మక్క సారమ్మ పగిడిద్దరాజు గోవిందరాజుల మహా జాతర ఈనెల 28 నుంచి 31 వరకు మేడారం మహా జాతర అంగరంగ వైభవంగా జరిగింది .ఇందులో భాగంగా వివిధ గ్రామాల నుంచి మేడారం చేరుకున్న మహాదేవతలు నాలుగు రోజులపాటు మేడారం గద్దెలపై కొలువై ఉండి భక్తులకు దర్శనమిచ్చారు. శనివారం రాత్రి 7.55 గంటలకు వన దేవతలైన సమ్మక్క తల్లి చిలకల గుట్టకు ,సారళమ్మ కన్నెపల్లి, పగిడిద్దరాజు మహబూబాబాద్ జిల్లాలోని గంగారం మండలం పూనుగోండ్ల కామారం, గోవిందరాజులు ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామాలకు తరలి వెళ్లారు. నాలుగు రోజులపాటు వన దేవతలను ఆరాధిస్తూ ప్రత్యేక పూజలను భక్తులు నిర్వహించారు .శనివారం రాత్రి రాష్ట్ర మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రామనాథ్ కేకాన్ ,ఐటిడిఏ పిఓ చిత్ర మిశ్రా తోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లా వివిధ శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులు అమ్మవార్లకు వీడుకోలు పలికారు . ఈ ప్రాంత ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని ములుగు జిల్లా అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని అమ్మవార్లను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయా దేవతల పూజారులు ,దేవాదాయ శాఖ అధికారులు ,పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
…………………………………………………………….
