* ఆర్ అండ్ బి ఇంజనీర్ ఇన్ చీప్ మోహన్ నాయక్
ఆకేరు న్యూస్, ములుగు: మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల ఆవరణలో మాస్టర్ ప్లాన్ ప్రకారం చేపడుతున్న అభివృద్ధి పనులు ఛాలెంజ్ గా తీసుకొని సకాలంలో పూర్తి చేయాలని ఆర్ అండ్ బి ఈ ఎన్ సి మోహన్ నాయక్. సూచించారు. బుధవారం ఆయన ఆస్మికంగా మేడారం లో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత శాఖ ఇంజనీరింగ్ అధికారులతో, కాంట్రాక్టర్లతో మాట్లాడుతూ గద్దెల ఆవరణలో జరుగుతున్న పనులన్నీ పూర్తి స్థాయిలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. ప్రతి పని వివరాలను సంబంధిత అధికారులను కాంట్రాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఎన్ని రోజులలో పూర్తి చేస్తారని, ప్రతి ఒక్క పిల్లర్ వద్ద కాంట్రాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈనెల ఏడవ తారీకు నుంచి 10వ తారీకు వరకు పిల్లర్స్ తో పాటు గ్రానైట్ పనులు పూర్తి చేయాలని సూచించారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడిబందిగా గ్రానైట్ కి సంబంధించిన అధికారులు, పిల్లర్ల నిర్మాణ పనులకు సంబంధించిన ఇంజనీరింగ్ అధికారులు సమన్వయంతో పనులు పూర్తి చేయాలన్నారు. 13,14 తారీకులలో మంత్రులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి సైతం అభివృద్ధి పనులను పరిశీలించి ముఖ్యమంత్రి కి నివేదిక సమర్పిస్తారని ఇందులో భాగంగా అధికారులు అప్రమత్తంగా ఉంటూ సకాలంలో పూర్తి చేయాలని కోరారు. ఆయన వెంట ఆర్ అండ్ బి శాఖ ఇంజనీరింగ్ అధికారులు కాంట్రాక్టర్లు తదితరులు ఉన్నారు. మొదట ఆయన తో పాటు ఇంజనీరింగ్ అధికారుల బృందం అమ్మవార్ల దగ్గరను దర్శించుకుని ఆదివాసి ఆచార సంప్రదాయాల ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

…………………………………………
