
* కేసీఆర్ కు పేరు రావడం ఇష్టం లేక దుష్ప్రచారం
* కాళేశ్వరాన్ని నాలుగేళ్లలో పూర్తిచేశాం
* ప్రజల దృష్టిని మళ్లించడానికే ఈ నాటకం
* ప్రజలు అంతా గమనిస్తున్నారు
* బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మేడిగడ్డ పగుళ్ల వెనుక కాంగ్రెస్ కుట్ర ఉందని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఎలాగైనా అధికారంలోకి రావాలనే ఈ పనిచేశారేమో అనే అనుమానాలు వస్తున్నాయని కేటీఆర్ అన్నారు. కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ హాజరవుతున్ననేపధ్యంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.కేసీఆర్ కమిషన్ ఎదుట హాజరవుతున్న బీఆర్కే భవన్ ఎదుట కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.కాళేశ్వరం ప్రాజెక్టులో వంద కంపోనెంట్స్ ఉంటాయని కేవలం ఒక్క దాన్లో చిన్న పగుళ్ల వస్తే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకే ముప్పు వచ్చిందనే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తోందన్నారు.నాలుగేళ్లలో కాళేశ్వరాన్ని పూర్తిచేసి 40 లక్షల ఎకరాలకు నీరందించామని కేటీఆర్ అన్నారు. నీటి పారుదల రంగంపై సీఎం రేవంత్ రెడ్డికి అవగాహన లేదని కేటీఆర్ విమర్శించారుజ 94 వేల కోట్లు ఖర్చయిన కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందనం అన్యాయమన్నారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని తగిన సమయంలో తగిన విధంగా ప్రజలే కాంగ్రెస్కు బ్ది చెప్తారని కేటీఆర్ అన్నారు.
…………………………………………………