Meerpet Warehouse Fire Hyderabad
ఆకేరు న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నందనవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మెట్రో బార్ సమీపంలోని ఓ ప్లాస్టిక్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి, పక్కనే ఉన్న మరో గోదాంకు, సమీప ఇళ్లకు వేగంగా వ్యాపించాయి. మూడు ఫైరింజన్లతో రంగంలోకి దిగిన సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదంలో ప్రాణనష్టం తప్పినప్పటికీ, భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం.
