
ఆకేరు న్యూస్, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మెగా డీఎస్సీ (AP MEGA DSC) పరీక్షలు ప్రారంభం అయ్యాయి. నేటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 44 దశల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 వరకు మరో సెషన్ ఉండనుంది. పరీక్ష ప్రారంభానికి గంటన్నర ముందు నుంచే కేంద్రాల్లోకి అనుమతిస్తారు. మొత్తం 16,437 పోస్టులకు 3,36,305 మంది 5,77,675 దరఖాస్తులు చేసుకున్నారు. కంప్యూటర్ ఆధారిత విధానంలో జరిగే పరీక్షల కోసం రాష్ట్రంలో 137 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. తెలంగాణ(TELANGANA)లోని హైదరాబాద్, కోదాడ.. చెన్నై, బెంగళూరు, బెర్హంపూర్లో కూడా మరో 17 కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాగా, ఏపీ డీఎస్సీ పరీక్షలకు నాన్ లోకల్ కేటగిరీలో 20 శాతం ఉపాధ్యాయ ఉద్యోగాలకు పోటీపడేందుకు తెలంగాణ చెందిన సుమారు 7 వేల మంది దరఖాస్తు చేసుకోవడం గమనార్హం.
……………………………………………..