
– హాజరైన వేలాదిమంది నిరుద్యోగులు
– యువత ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి
– ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
ఆకేరు న్యూస్, హుజురాబాద్: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. హుజూరాబాద్ పట్టణంలోని సిటీ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన జాబ్ మేళాకు నిరుద్యోగులు భారీ సంఖ్యలో పాల్గొని, ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకున్నారు.ఈ మెగా జాబ్మేళలో 85 కంపెనీలు పైగా వారి ప్రాతినిథ్యాన్ని వహించాయి. దాదాపు 4వేలకు పైగా నిరుద్యోగులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. యువత ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉపాధి అవకాశాలను ఎక్కడ ఉన్నా కూడా అందిపుచ్చుకోవాలని అన్నారు. .గతంలో మాజీ సీఎం కేసీఆర్ రెండు లక్షల పైగా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చారని, మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ హయాంలో దాదాపు 12 లక్షల ఉద్యోగాలు కల్పించారని గుర్తు చేశారు. ఎన్నికల వరకే రాజకీయాలని, రాజకీయాలకు అతీతంగా జాబ్ మేళా నిర్వహించానని అన్నారు. సాయంత్రం జాబ్ మేళాలో ఎంపికైన యువతీ, యువకులకు ఇంటర్వ్యూలు నిర్వహించిన కంపెనీలు విద్యార్హతను బట్టి తమ సంస్థల్లో పనిచేసేందుకు షార్ట్ లిస్ట్ చేసిన 1100మందికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నియామకపత్రాలు అందజేశారు.అన్నా అంటే నేను ఉంటానని, ధైర్యంగా ఉద్యోగాలలో చేరాలని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ రాధికా,మున్సిపల్ వైస్ చైర్మన్ నిర్మల, నాయినేని తిరుపతిరావు, సత్యనారాయణ రావు తదితరులు పాల్గొన్నారు.
……………………………………………………