Chiranjeevi Praises Ravi Teja's Irumudi Movie
* ‘ఇరుముడి’పై చిరంజీవి ప్రశంసలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్:
మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన ‘ఇరుముడి’ చిత్రంపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. సినిమాను పూర్తిగా ఆస్వాదించానని పేర్కొంటూ చిత్రబృందాన్ని అభినందించారు. ముఖ్యంగా రవితేజ నటన అద్భుతంగా ఉందంటూ ప్రశంసించారు. ఇరుముడి విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న సందర్భంగా చిరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
* సినిమా ప్రాణం పోశారు.. రవితేజ
రవితేజ పోషించిన త్రినాథ్ పాత్రను ప్రత్యేకంగా ప్రస్తావించిన చిరంజీవి.. ఆ పాత్రను ఆయన అద్భుతంగా మోశారని కొనియాడారు. తన నటనతో సినిమాకు ప్రాణం పోశారని ప్రశంసించారు. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన విధానాన్ని కూడా మెగాస్టార్ అభినందించారు. భావోద్వేగాలను చక్కగా తెరపై ఆవిష్కరించారని పేర్కొన్నారు.
* బాలనటి నక్షత్రకు ఉజ్వల భవిష్యత్ ..
చిత్రంలోని బాలనటి నక్షత్ర నటనను కూడా చిరంజీవి ప్రత్యేకంగా ప్రశంసించారు. ఆమెకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని ఆశీర్వదించారు. నిర్మాతలు నవీన్ యెర్నేని, రవి శంకర్‌తో పాటు మొత్తం చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
* ‘పరిశ్రమ అందరిదీ’
చిరంజీవి చేసిన మరో వ్యాఖ్య ప్రస్తుతం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. “ఒక సినిమా విజయం పరిశ్రమలోని అందరికీ పండుగే. ఈ పరిశ్రమ అందరిదీ.. ఏ కొందరిదో కాదు. మనం బతకాలి.. ఇతరులనూ బతికించాలి” అంటూ ఆయన పేర్కొన్నారు. ఒక సినిమా విజయాన్ని మొత్తం చిత్ర పరిశ్రమ కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని ఆయన సందేశం ఇచ్చారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
