ఆకేరు న్యూస్, కమలాపూర్: మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ, గ్రామాల్లో ప్రజల సమస్యలు తీరుస్తూ అందరి మన్ననలు అందుకుంటున్న కమలాపూర్ ఎంపీడీవో గుండె బాబుకు పరిషత్ విభాగంలో మెరిటోరియస్ అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా శుక్రవారం హనుమకొండ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ స్నేహశబరీష్ చేతుల మీదుగా ఆయన అవార్డ్ అందుకున్నారు. మండలంలోని ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ,విధి నిర్వహణలో ఎల్లప్పుడూ ముందుండే ఎంపీడీవో గుండె బాబు కు అవార్డు రావటం పట్ల పలువురు అభినందనలు తెలిపారు.
…………………………………………….
