
* భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే చాన్స్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని హెచ్చరించింది. ఉపరితల చక్రవాత ఆవర్తనంతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయని వివరించింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, హైదరాబాద్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షాల కారణంగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. కాగా, హైదరాబాద్లో ఉదయం నుంచీ వాతావరణం మబ్బులు కమ్మి ఉంది.
…………………………………………