* మూడేళ్లుగా కొత్త పరికరాల లేమీతో ఆసుపత్రి
* ఇద్దరు మంత్రులున్నా.. పట్టింపు కరువు..
* జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
ఆకేరు న్యూస్, వరంగల్ :ఎంజీఎంలో సూది ఉంటే.. దూది లేని దుస్థితి నెలకొందని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణా జాగృతి జనం బాటలో భాగంగా ఈ రోజు వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించారు. అక్కడ నెలకొన్న సమస్యలపై తీవ్రంగా స్పందించారు. ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను అంధకారంలోకి నెట్టిందన్నారు. ఉత్తర తెలంగాణాకే తలమానికంగా ఎంజీఎం ఉందని.. ఆసుపత్రిని చూస్తే కనీసం సూది.. దూది లేకుండా ఉందని పాలకులపై మండిపడ్డారు. వరంగల్ జిల్లాలో ఇద్దరు మహిళా మంత్రులు ఉన్నారని.. అయినా పట్టించునే దిక్కులేకుండాపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. మూడు సంవత్సరాల నుంచి ఆసుపత్రిలో కొత్త పరికరాలు లేవని.. నిత్యం వేలాది మంది ప్రజలు ఇక్కడకు వస్తారని.. ప్రజా ఆరోగ్యంపై ప్రభుత్వం పట్టింపులేకుండా ఉందన్నారు. ఇదేనా తెలంగాణాలో ప్రజా పాలనా..? ప్రభుత్వాన్ని నిలదీశారు.
