
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : వరంగల్ జిల్లా అభివృద్ధిపై జిల్లా ఇన్ చార్ఝ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ( ponguleti srinivas reddy) సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రులు కొండా సురేఖ ( konda surekha ) సీతక్కలు ( seethakka) ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. వరంగల్ నగరంలో జరుగుతున్న అభివృద్ధిపై ముగ్గురూ సమీక్షించారు. ఔటర్ రింగ్ రోడ్డు పనులు రైల్వే పనుల్లో జరుగుతున్న అభివృద్ధిపై చర్చించారు.అలాగే నగర ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మామునూరు ( mamunoor airport )విమానాశ్రయం, టెక్స్టైల్ (textile park) పార్కులపై ముగ్గురు మంత్రులు చర్చించారు. వర్షాకాలంలో నగరంలో ఉండే పరిస్థితులను మంత్రులు సమీక్షించారు. నగరంలో డ్రైనేజీ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో అన్ని విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
………………………………………..