ఆకేరు న్యూస్, కరీంనగర్ : తిరుమల శ్రీవారిని రవాణా, బీసీ సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. తెలంగాణ రాష్ట్రంలో సమృద్ధి వర్షాలతో, పాడి పంటలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రజా పాలన ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగాలని ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామివారిని వేడుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాష్ట్ర, కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలనే సంకల్పంతో క్యాంప్ కార్యాలయంలో ఆదివారం సామూహిక సత్యనారాయణ వత్రం చేసిన విషయం తెలిసిందే.
………………………………………….
