
* చిన్నారి చికిత్సకు ఆదేశం
ఆకేరు న్యూస్, ములుగు : ములుగు జిల్లా తాడ్వాయి మండలం గుత్తికోయ గూడెంకి చెందిన వెట్టి సంతోష్ భార్య వెట్టి సోనీ ఇటీవల పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఈ క్రమంలోనే మగ శిశువుకు జన్మనిచ్చిన అనంతరం దురదృష్టవశాత్తు సోనీకి పస్కలు(జాండిస్)తో మరణించారు, బాబుకు కూడా స్కలు(జాండిస్) తల్లి పాల ద్వారా సోకి అనారోగ్యానికి గరయ్యాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క ( Seethakka ) బాధితులను వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించి ప్రత్యేక చికిత్సను అందించమని MGM సూపరింటెండెంట్ ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు వారి పీఏ సంతోష్ వరంగల్ లోని ఎంజీఎం వెళ్లి బాధితులను కలిశారు. ఎంజీఎం వైద్యులతో బాబు ఆరోగ్యం విషయమై మాట్లాడారు. అనంతరం బాధితుడితో సైతం మంత్రి సీతక్క ఫోన్లో మాట్లాడారు. అధైర్యపడవద్దని, అండగా ఉంటానని హామీ ఇచ్చారు. బాబు ఆరోగ్యం బాగుందని బాధితుడికి భోరోసానిచ్చారు. తన బాబు ఆరోగ్యం కాపాడేందుకు సహకరించి, మెరుగైన వైద్యం అందేలా కృషి చేసి, ఆర్థిక సాయం చేసిన మంత్రి సీతక్క కు బాధితుడు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
—————————-