ఆకేరు న్యూస్, ములుగు:
ములుగు జిల్లా సమ్మక్క సారలమ్మ తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క సారలమ్మ వన దేవతలను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క దర్శించుకున్నారు.
ఆనంతరం తాడ్వాయి మండలంలోని 25 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను మంత్రి లబ్దిదారులకు అందించారు.
ఈ కార్యక్రమంలోమంత్రి వెంట జిల్లా కలెక్టర్ దివాకర టి. ఎస్., ఎస్ పి సుధీర్ రామ్ నాథ్ కేకన్,
అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, ఎండోమెంట్ అడిషనల్ కమిషనర్ సునీత, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, ఆర్డీఓ వెంకటేష్, జాతర చైర్ పర్సన్ ఇరుప సుకన్య సునీల్ దొర పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, సారలమ్మ పూజారి కాక వెంకటేశ్వర్లు ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
