
ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన 495 కుటుంబాలకు యునైటెడ్ వే, ఇన్ఫోసెస్ సంస్థల ఆధ్వర్యంలో నిత్యవసర సరుకుల పంపిణీ లో భాగంగా గోవిందరావుపేట మండలంలోని ప్రాజెక్టు నగర్ లో పలు గ్రామాల లోని 149 కుటుంబాలకు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ స్వచ్ఛంద సేవా సంస్థ యునైటెడ్ వే ఆధ్వర్యంలో ప్రతి కుటుంబానికి బియ్యం, పప్పులు, నూనె, గోధుమ పిండి, సబ్బులు తదితర నిత్యావసర సరుకులను అంద చేయడం జరుగుతుందని తెలిపారు. బాధిత కుటుంబాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తక్షణ సహాయాన్ని అందించడం జరుగిందని అన్నారు. ప్రతి సంవత్సరం భారీ వర్షాల వలన పలు గ్రామాల్లో ప్రజలు నష్టపోతుంటారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రభుత్వంతో పాటు
సేవా సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని, ఏ ఒక్క కుటుంబం ఆహారం లేక ఇబ్బందులు పడకుండా నిత్యవసర సరుకులను అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులకు కూడా అవసరమైన సహాయం అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ యునైటెడ్ వే, ఇన్ఫోసెస్ సంస్థల ప్రతినిధులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.
……………………………………………….