ఆకేరున్యూస్, ములుగు: ములుగు పట్టణ అభివృద్ధి పనుల్లో భాగంగా 4 కోట్ల రూపాయలతో సెంట్రల్ లైటింగ్, సీసీ రోడ్డును రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ములుగు నియోజకవర్గంలో ప్రతి గ్రామ గ్రామాన అభివృద్ది శరవేగంగా జరుగుతుందని ములుగు పట్టణంలో ప్రతి రోడ్డు అభివృద్ధి జరగబోతుందని ఇటీవలే ములుగు ప్రభుత్వ ఆసుపత్రి నుండి తోపు కుంట చెరువు వరకు 4 కోట్ల రూపాయలతో సెంటర్ లైటింగ్ తో సీసీ రోడ్డు నిర్మించడం జరిగిందని తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రతి మండలంలో అన్ని గ్రామాల్లో ప్రతి రోడ్లు నిర్మిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్ , ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి ,జిల్లా నాయకులు,పట్టణ కాంగ్రెస్ నాయకులు ,మహిళ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
…………………………………………….
