* గోదావరి జిలాలను ములుగు లోని అన్ని ప్రాంతాలకు తరలించడానికి చర్యలు.
* రాష్ట్ర మంత్రి సీతక్క.
ఆకేరు న్యూస్, ములుగు: రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని, ములుగు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు అధిక నిధులను మంజూరు చేస్తున్నారని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. గురువారం ములుగు మండలం లోని జీవాంతరావు పల్లి లో 20 లక్షల తో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని, ఇందిరమ్మ ఇల్లు, 5 లక్షల తో నిర్మించిన హనుమాన్ టెంపుల్ ప్రహరీ గోడ, 3 కోట్ల 50 లక్షల తో నిర్మించిన పి డబ్ల్యూ డి ములుగు నుండి గణేష్ పల్లి వయా జీవాంతరావు పల్లి వరకు డబుల్ లైన్ రోడ్డు డివైడర్ సెంట్రల్ లైటింగ్ లను సీతక్క, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, గ్రంథాలయల సంస్థ చైర్మన్ రవి చందర్, ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డి లతో కలసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో తాను ఎమ్మెల్యేగా కొనసాగినప్పటికీ ఒక్క రూపాయి కేటాయించక పోవడంతో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేకపోయానని, నేడు ప్రజా ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతూ అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని వివరించారు. జిల్లాలో అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసే బాధ్యత తనదని, ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకోవాలి తెలిపారు. ములుగు నియోజకవర్గంలో సమ్మక్క సారక్క బ్యారేజీ, దేవాదుల ప్రాజెక్టు నిర్మించినప్పటికీ అప్పటి పాలకులు వారి వారి ప్రాంతాలకు గోదావరి జలాలను పోయాఅని, నేడు గోదావరి జలాలను నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలకు తరలించి రెండు పంటలు పండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మేడారంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో 143 కోట్ల రూపాయలతో లిఫ్ట్ ఏర్పాటు చేసి ములుగు మండలంలోని అన్ని ప్రాంతాలకు నీటిని తరలించే విధంగా ఆమోదం తెలుపడం జరిగిందని, రామప్ప నుండి లక్నవరం సరస్సు కు గోదావరి జిల్లాల తరలించడానికి 35 కోట్లు విడుదల అయ్యాయని అన్నారు. మేడారం చేరుకోవడానికి పర్యాటకులు ప్రస్తుతం జంగాలపల్లి మీదుగా రామప్ప చేరుకుంటున్నారని, పర్యాటకులు భక్తులు చుట్టూ తిరిగి వెళ్లకుండా ములుగు నుండి ఇదే రహదారి గుండా రామప్ప వెళ్లడానికి రోడ్డు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. రామప్ప సరస్సులో 13 కోట్ల రూపాయలతో ఐలాండ్ నిర్మించి శివుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. మహిళా సంఘాల సభ్యులు ఆర్థికంగా ఎదగడానికి మేడారం మహ జాతరను పురస్కరించుకొని మహిళా సంఘాలకు చెందిన 560 మందికి ఆర్థిక సహాయం చేసి వివిధ వ్యాపారాలు కొనసాగించడానికి అవకాశం కల్పించామని, వెనుకబడిన ములుగు ప్రాంతాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నానని వివరించారు. నాయకుడు అనే ప్రతి వ్యక్తి గెలిచిన ఓటమి చెందిన ప్రజల మధ్య ఉండాలని అన్నారు. ఈకార్యక్రమంలో తాజా మాజీ ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

……………………………………………………
