
ఆకేరు న్యూస్, ములుగు: జిల్లా కేంద్రం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనుసరి అనసూయ సీతక్క జన్మదిన వేడుకలను బాల సత్రం పిల్లలతో ఘనంగా నిర్వహించుకున్నారు. అనంతరం మంత్రి తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు నూతన దుస్తులను బహూకరించారు. ఈ కార్యక్రమంలో ములుగు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ భాను రవిచందర్, తోపాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కార్యకర్తలు వివిధ మండలాల అధ్యక్ష కార్యదర్శులు తదితరులున్నారు.
……………………………………………