* ఇలాంటి నిర్ణయాలతో వికసిత్ భారత్ సాధ్యం కాదు
* బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగింది
* శాసనసభలో మంత్రి శ్రీధర్‌బాబు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బడ్జెట్ (Budget) లో తెలంగాణ (Telangana) కు తీవ్రమైన అన్యాయం జరిగిందని, ఫెడరల్ స్ఫూర్తికి భిన్నంగా కేంద్రం తీరు ఉందని మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) అన్నారు. సమైక్య న్యాయసూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించిందని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల్లో (Assembly meetings) ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి సహాయం అందించాలని కేంద్ర పెద్దలను ఎన్నిసార్లు కలిసినా పట్టించుకోలేదని విమర్శించారు. తెలంగాణలోని వెనుకబడిన జిల్లాలను కేంద్రం పట్టించుకోలేదన్నారు. నవోదయ (Navodaya), సైనిక్ స్కూళ్లలో (Sainik schools) నూ వివక్ష చూపారని తెలిపారు. హైదరాబాద్ (Hyderabad) – బెంగళూరు (Bangalore) ఇండస్ట్రియల్ కారిడార్ (Industrial Corridor) లోనూ తెలంగాణకు అన్యాయమే జరిగిందన్నారు. ఇలాంటి నిర్ణయాలతో వికసిత్ భారత్ సాధ్యం కాదన్నారు. గతానికి సంబంధించిన పెండింగ్ నిధుల (Pending funds) ను కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదని, ఇది ముమ్మాటికీ తెలంగాణపై వివక్షే అన్నారు. పూర్వోదయ స్కీమ్‌లో నూ కొన్నిరాష్ట్రాలకే ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. హౌసింగ్, టెక్స్ టైల్ రంగాలకు నిధులు ఇవ్వలేదని, టూరిజం అభివృద్ధికి కూడా కేంద్ర ప్రభుత్వం సహకరించకపోవడం అన్యాయమన్నారు.
————————