
* మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్
ఆకేరున్యూస్, వరంగల్: బీఆర్ఎస్ హయాంలోనే కేసీఆర్ మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారని మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా సిటిజెన్ ఫంక్షన్ హాల్లో ముస్లిం మహిళలకు మంగళవారం నిత్యావసర సరుకులను ఆయన అందజేశారు. బీఆర్ఎస్ నాయకులు అబ్బు ఆధ్వర్యంలో ఉచితంగా వస్తువులను అందజేశారు. ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ… తెలంగాణలో సర్వమత సౌభ్రాతృత్వం విలసిల్లుతుందని అన్నారు. మత సామరస్యానికి, పరమత సహనానికి తెలంగాణ నెలవని తెలిపారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో మైనార్టీల కోసం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం జరిగిందని వివరించారు. అల్లా కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని ప్రార్థించారు. అల్లా బోధించిన ప్రేమ, శాంతి మార్గాల్లో పయనిద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కార్పొరేటర్ నల్లా సుధాకర్ రెడ్డి స్వరూప రాణి, మైనార్టీ నాయకులు ఖుద్దూస్, మహమ్మూద్ బ్రూహాన్, తదితరులు పాల్గొన్నారు.
……………………………………………