వైట్ గోల్డ్‌తో మెరిసిపోతున్న మిస్ యూనివర్స్ కొత్త కిరీటం
* 75వ వార్షికోత్సవానికి ప్రత్యేక ఆకర్షణ
* కొత్త కిరీటం ఆవిష్కరణ
* వైట్ గోల్డ్‌తో మెరిసే కిరీటం..
ఆకేరు న్యూస్, డెస్క్ : ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అందాల పోటీ మిస్ యూనివర్స్ 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వాహకులు ప్రత్యేక కిరీటాన్ని (Miss Universe New Crown) ఆవిష్కరించారు. 3,150 వజ్రాలు, 18 క్యారెట్ల వైట్ గోల్డ్‌తో రూపొందించిన ఈ కిరీటానికి ‘ది రేడియన్స్ ఆఫ్ యాన్ ఎటర్నల్ లెగసీ’ (The Radiance of an Eternal Legacy) అని పేరు పెట్టారు. మిస్ యూనివర్స్ చరిత్ర, మహిళల ప్రస్థానం, భవిష్యత్తు తరాల ఆశయాలకు ప్రతీకగా ఈ కిరీటాన్ని రూపొందించినట్లు నిర్వాహకులు వెల్లడించారు.
* జార్జ్ విటెల్స్ ప్రత్యేక రూపకల్పన..
ప్రముఖ ఆభరణాల డిజైనర్ జార్జ్ విటెల్స్, పారిస్‌కు చెందిన ఫైన్ జ్యువెలరీ సంస్థ Maison d’OR కలిసి ఈ కిరీటాన్ని రూపొందించాయి. 18 క్యారెట్ల వైట్ గోల్డ్‌పై 3,150 వజ్రాలను (Miss Universe New Crown) పొదిగి అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. మిస్ యూనివర్స్ 75 ఏళ్ల ప్రస్థానాన్ని ప్రతిబింబించేలా దీని రూపకల్పన చేసినట్లు సమాచారం. ఈ కిరీటంలోని వజ్రాల అమరికకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.
వెనుక భాగంలో వజ్రాలతో ‘75’ అనే సంఖ్యను రూపొందించారు. అలాగే మూడు ప్రధాన వజ్రాలు పోటీ గతం, వర్తమానం, భవిష్యత్తుకు ప్రతీకలుగా నిలుస్తాయి. గతంలో మహిళలు సాధించిన విజయాలు, ప్రస్తుతం సమాజంలో మార్పు తీసుకొస్తున్న మహిళలు, రాబోయే తరాల మహిళల ఆశయాలను ఈ మూడు వజ్రాలు సూచిస్తాయని నిర్వాహకులు వివరించారు.
* నవంబర్ 24న విజేతకు కిరీటం..
మిస్ యూనివర్స్ 75వ ఎడిషన్ గ్రాండ్ ఫినాలే నవంబర్ 24న ప్యూర్టో రికోలోని శాన్ జువాన్‌లో జరగనుంది. ఈ పోటీలో విజేతగా నిలిచే అందాల సుందరికి కొత్త కిరీటాన్ని అలంకరించనున్నారు. ప్రస్తుత మిస్ యూనివర్స్ విజేత ఫాతిమా బోష్ తన వారసురాలికి కిరీటాన్ని అందజేయనున్నారు. ఈ కొత్త కిరీటం ఆవిష్కరణ కార్యక్రమంలో గతంలో మిస్ యూనివర్స్ విజేతలకు అలంకరించిన 18 కిరీటాలను కూడా ప్రదర్శించారు. 75 ఏళ్ల చరిత్రలో పోటీకి సంబంధించిన ప్రత్యేక జ్ఞాపకాలను ఈ కార్యక్రమం ద్వారా గుర్తుచేశారు.
* మహిళల సాధికారతకు ప్రతీకగా..
మిస్ యూనివర్స్ పోటీ కేవలం అందాల పోటీ మాత్రమే కాకుండా మహిళల ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత, సాధికారతకు వేదికగా నిలుస్తోందని నిర్వాహకులు పేర్కొన్నారు. గత ఏడున్నర దశాబ్దాలుగా ఈ వేదికపై తమ ప్రతిభను చాటుకున్న మహిళల ప్రయాణాన్ని గౌరవిస్తూ కొత్త కిరీటాన్ని రూపొందించినట్లు తెలిపారు.
* మిస్ యూనివర్స్ 75వ వార్షికోత్సవం..
75 ఏళ్ల మిస్ యూనివర్స్ చరిత్రకు గుర్తుగా ఆవిష్కరించిన ఈ ప్రత్యేక కిరీటం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందాల పోటీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. నవంబర్ 24న ఈ కిరీటాన్ని ఎవరు దక్కించుకుంటారన్న ఆసక్తి నెలకొంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

