* నా రాజకీయ ఎదుగుదలకు కృషి చేశారు
ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
40 ఏళ్లుగా నాకు తోడుగా, అండగా నా రాజకీయ ఎదుగుదలకు అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి లేడు.. ఇక రాడని స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి బాధాతప్త హృదయంతో ఆవేదన చెందారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతకుంట్ల నరేందర్ రెడ్డి సంతాప సభ శుక్రవారం ‘ఎస్ కన్వెన్షన్’ లో జరిగింది. ఈ సందర్బంగా నరేందర్ రెడ్డి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. నరేందర్ రెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు. నరేందర్ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ చింతకుంట్ల నరేందర్ రెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని బాధపడ్డారు. 1987లో లెక్చరర్ ఉద్యోగాన్ని వదిలి రాజకీయాలలోకి అప్పుడు వచ్చిన మొదటగా నాకు అండగా నిలిచిన వ్యక్తి చింతకుంట్ల సురేందర్ రెడ్డి అన్నారు. దాదాపు 40 ఏళ్లుగా నాకు తోడుగా, అండగా చింతకుంట్ల కుటుంబం నిలిచిందని తెలిపారు. నా రాజకీయ ఎదుగుదలకు నరేందర్ రెడ్డి అహర్నిశలు కృషి చేశారని అయన మరణం నాకు వ్యక్తిగతంగా తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. స్టేషన్ ఘనపూర్ అభివృద్ధి కోసం అనుక్షణం తాపత్రయపడ్డారని 100 పడకల ఆసుపత్రి రావాలని పట్టుబాట్టారని అంటే దానికి నరేందర్ రెడ్డి కారణం అన్నారు. ఇంటిగ్రెటెడ్ రెవెన్యూ డివిజనల్ కార్యాలయం, డిగ్రీ కళాశాల తేవాలని అడిగారని అన్నారు. మున్సిపాలిటీ చేయాలని, అడగాలా మున్సిపాలిటీ పై కాంగ్రెస్ జెండా ఎగరాలని ఆరోగ్యం సహకరించకున్నా ఎంతగానో కృషి చేశారని వెల్లడించారు. కానీ స్టేషన్ ఘన్ పూర్ అభివృద్ధి జరుగుతున్న తరుణంలో నరేందర్ రెడ్డి మన మధ్య లేకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. నరేందర్ రెడ్డి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటానని, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు. నరేందర్ రెడ్డి ఆశయాలాకు, ఆలోచనలకు అనుగుణంగా మనందరం కలిసి కట్టుగా పని చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, స్టేషన్ ఘనపూర్ మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, స్టేషన్ ఘనపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ జూలుకుంట్ల లావణ్య, చిల్పూర్ ఆలయ కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ రాజమ్మ, కౌన్సిలర్లు, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
