*ఆత్మీయ మిత్రునికి అంతిమ వీడ్కోలు పలికిన ఎమ్మెల్యే
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
ఆత్మీయ మిత్రుడు, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతకుంట్ల నరేందర్ రెడ్డి పార్థివా దేహానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి అశ్రునయనాలతో నివాళులు అర్పించారు. నరేందర్ రెడ్డితో ఉన్న 30 ఏళ్ల అనుబంధాన్ని గుర్తు చేసుకొని కన్నీరు పెట్టుకున్నారు. నరేందర్ రెడ్డి అంతిమ యాత్రలో పాడే మోసి ఆఖరి మజిలీ తెలిపారు. చిరకాల నేస్తాన్ని చివరి వరకు సాగనంపి కన్నీళ్లతో కడసారి వీడ్కోలు తెలిపారు. శోకసంద్రంలో మునిగిన నరేందర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. నరేందర్ రెడ్డి లోటు ఎవరూ పుడ్చలేనిదని కుటుంబ సభ్యులు ఇలాంటి కష్టం సమయంలోనే మనో ధైర్యాన్ని కోల్పోకూడదని భరోసా నింపారు. నా 30 ఏళ్ల రాజకీయ జీవితంలో నా వెంటే ఉంటూ నాకు అండగా నిలిచిన నరేందర్ రెడ్డిని కోల్పోవడం అత్యంత బాధాకరమని తెలిపారు. నరేందర్ రెడ్డి మరణం వ్యక్తిగతంగా నాకు, నియోజకవర్గ ప్రజలకు తీరని లోటని అన్నారు. నరేందర్ రెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు. నరేందర్ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, స్టేషన్ ఘనపూర్ మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు, మండల పార్టీ అధ్యక్షులు, అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు, స్టేషన్ ఘనపూర్ పట్టణ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని నరేందర్ రెడ్డి కి వీడ్కోలు పలికారు.
*” పాడే మోసిన మాజీ ఎమ్మెల్యే
మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతకుంట్ల నరేందర్ రెడ్డి అంతిమ యాత్రలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య పాడే మోసి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఆయన వెంట టిఆర్ఎస్ శ్రేణులు ఉన్నారు.
