
– రాజ్యాంగాన్ని పరిరక్షించి భవిష్యత్ తరాలకు అందించాలి
– హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్.
ఆకేరు న్యూస్ , కమలాపూర్ : హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ప్రజా సమస్యలను గాలి కొదిలేసారని హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.కమలాపూర్ మండలంలోని ఉప్పల్, ఉప్పల్ పల్లె గ్రామలల్లో రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో వొడితల ప్రణవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ…. బీజేపీ పార్టీ రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటుందని దానిని అడ్డుకోవాలని, రాబోయే తరాలకు రాజ్యాంగాన్ని పరిరక్షించి అందించాలని జై భీమ్ జై బాపు జై సంవిధాన్ కార్యక్రమాన్ని వాడవాడకి తీసుకెళ్తున్నామని ఆయన అన్నారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ప్రజా సమస్యలను గాలి కొదిలేసి నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి, సీఎంఆర్ ఎఫ్ దాదాపు 200 చెక్కులను డేట్ దాటినాక కూడా ఎమ్మెల్యే పంచట్లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ఇస్తున్న చెక్కులను పంచనివ్వకుండా కోర్టుకు వెళ్తూ కాలక్షేపం చేస్తున్నారని వోడితల ప్రణవ్ అన్నారు. రాష్ట్రంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల కోసం దాదాపు 1000 కోట్లు ఖర్చు చేశామని అన్నారు. లబ్ధిదారుల సంతకాలు తీసుకొని సంబంధిత అధికారులు వారికి చెక్కులు పంపిణీ చేసెలా సూచనలు చేస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు,కార్యకర్తలు,ఎన్ ఎస్యుఐ నాయకులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు
…………………………………..