
* బాధ కలిగించాయని వెల్లడి
* మిమ్మల్ని ఉద్దేశించి అనలేదన్న స్పీకర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : అసెంబ్లీలో నిన్న స్పీకర్ ప్రసాద్‌కుమార్ చేసిన వ్యాఖ్యలు తనకు తీవ్ర బాధను కలిగించాయని నారాయణఖేడ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి (Sunitha Lakshma Reddy) అన్నారు. స్పీకర్ స్థానంలో ఉండి అలా అనడం బాధకరమన్నారు. తనపై వ్యాఖ్యలను స్పీకర్ ఉపసంహరించుకోవాలన్నారు. శాసనసభలో సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ‘‘సభ్యుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత స్పీకర్‌పైనే ఉంటుంది. నిన్న మీరు అన్నటువంటి మాటలు చాలా బాధాకరం. తాను మాట్లాడుతున్న సందర్భంలో సబ్జెక్టునుంచి ఎక్కడా డీవియేట్ కాలేదు. మహిళలు, శిశు సంక్షేమం, ఎస్సీ, ఎస్టీ సమస్యలపై మాట్లాడుతానని ముందే సమాచారం ఇచ్చాను. అవకాశం కోసం సాయంత్రం వరకు నిరీక్షించా. రాత్రి 8 గంటలకు మాట్లాడేందుకు తనకు అవకాశం కల్పించారు. రెండు నిమిషాల్లో పూర్తిచేయాలన్నారు. నేను మాట్లాడుతుండగా.. నాకే వినబుద్ధి అవడలేదని, మీరంతా ఎలా వింటున్నారో అని మీరు అనడం నాకు చాలా బాధకలిగించింది.’ అని చెప్పారు. దీనిపై స్పీకర్ (Speaker) స్పందిస్తూ తనకు మహిళంటే ఎనలేని గౌరవమని, మిమ్మల్ని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు అనలేదన్నారు. లక్ష్మారెడ్డి మాట్లాడేటప్పుడు రన్నింగ్ కామెంట్రీ ఎక్కువయ్యాయని ఈ డిస్టబెన్స్ లో ఆ వ్యాఖ్యలు తనకే వినబుద్ది కావట్లేదు, మీకు వినబుద్ది అవుతున్నదా అన్నట్లు బదులిచ్చారు. తన వ్యాఖ్యల వల్ల మీ మనసు కష్టపడితే విత్ డ్రా చేసుకుంటాననడంతో వివాదం సుద్దుమణిగింది.
…………………………………….