
* నియోజకవర్గ అభివృద్దిపై ప్రతిపాదనలు
ఆకేరు న్యూస్ పాలకుర్తి : పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధి దిశగా మరో ముఖ్యమైన అడుగు పడింది. ఎస్సీ, ఎస్టీ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ను పాలకుర్తి శాసన సభ్యురాలు యశస్విని రెడ్డి కలిసి నియోజకవర్గంలోని గిరిజన ప్రాంతాల అభివృద్ధి అంశాలపై పలు ప్రతిపాదనలు సమర్పించారు. ఇటీవల పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన అభ్యర్థన మేరకు వివిధ మండలాల్లోని తండాలు, గూడాలకు బీటీ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని మంత్రి తెలిపారు. దానికి సంబంధించిన ₹24 కోట్ల 30 లక్షల రూపాయల విలువైన ప్రభుత్వ ఉత్తర్వులు (జీ.ఓ) ను మంత్రి ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి అందజేశారు. గతంలో 6 కోట్లు రూ, తో కుడితే మొత్తం 30కోట్ల 30 లక్షల రూ, పాలకుర్తి నియోజకవర్గానికి అందించారు. అదే సందర్భంలో, ఎమ్మెల్యే పాలకుర్తి నియోజకవర్గంలోని వివిధ మండల కేంద్రాల్లో బంజారా భవనాల నిర్మాణానికి కూడా నిధులు మంజూరు చేయాలని మంత్రిని అభ్యర్థించారు. దీనిపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సానుకూలంగా స్పందిస్తూ, పాలకుర్తి నియోజకవర్గంలో గిరిజనులు అత్యధికంగా ఉన్నారు. వారి సామాజిక, సాంస్కృతిక అవసరాల దృష్ట్యా తాండాలు, గూడాలను మరింత అభివృద్ధి చేసేందుకు బంజారా భవనాలను మంజూరు చేస్తాను అని హామీ ఇచ్చారు..
………………………………………..