ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha).. బీసీల డిక్లరేషన్ అమలుకు డిమాండ్ చేస్తూ నేడు ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఇందిరాపార్కు వద్ద మహాసభ నిర్వహించనున్నారు. తీవ్ర ఉత్కంఠ అనంతరం పోలీసులు అనుమతి ఇచ్చారు. దీంతో సభ నిర్వహణకు బీఆర్ ఎస్ (Brs)కార్యకర్తలు సిద్ధమయ్యారు. భారీగా శ్రేణులు తరలిరావాలని నేతలు పిలుపునిచ్చారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ (Kamareddy Bc Declaration)అమలుతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేయాలన్న ప్రధాన డిమాండ్లతో కల్వకుంట్ల కవిత ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. సంఘ సంస్కర్త సావిత్రీబాయి ఫూలే జయంతిని పురసరించుకొని ఇందిరాపార్కు వద్ద బీసీ మహాసభ నిర్వహించనున్నారు. ఉదయం 11 నుంచి 4 గంటల వరకు ఇందిరాపార్ వద్ద జరిగే సభకు కొన్ని షరతులతో పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈనేపథ్యంలో రాజకీయంగా ఉత్కంఠ ఏర్పడింది.
……………………………….