ఆకేరు న్యూస్, కమలాపూర్: కమలాపూర్ తెలంగాణ మోడల్ స్కూల్ ఇంటర్ విద్యార్థినిలు క్రీడల్లో మరోసారి రాష్ట్రస్థాయికి ఎంపికై సత్తా చాటారు. సోమవారం ఉమ్మడి వరంగల్ , JNS గ్రౌండ్ లో నిర్వహించిన 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(SGFI) లో లాన్ టెన్నిస్ క్రీడలో సిహెచ్. నిహారిక MPC 2, నెట్ బాల్ విభాగంలో డిీ .రుచిత (MPC 1), బీ. ప్రవళిక( MPC 1) రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం పట్ల పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి .అనిత ఉపాధ్యాయుల బృందం, అభినందనలు తెలిపారు. వ్యాయామ ఉపాధ్యాయుడు రాజు, విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రస్థాయి పోటీలలో కూడా వీరు మంచి ప్రదర్శనను కనబరచాలని ఆకాంక్షించారు.
………………………………………
