* జాతర చరిత్రను భవిష్యత్తు తరాలకు అందించేందుకు కృషి
* జంపన్న వాగు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి
* 150 కోట్లతో శాశ్వత నిర్మాణం పనులు చేపడతాం
* మంత్రి ధనసరి అనసూయ సీతక్క
ఆకేరు న్యూస్, ములుగు: ఆదివాసి ఆరాధ్య దైవాలు సమ్మక్క సారలమ్మ దేవతల గద్దెల ఆవరణలో మాస్టర్ ప్లాన్ తో చేపట్టే ఆధునీకరణ పనులు దేవతల పూజారులు అభిప్రాయం మేరకే దేవ దేవతల ప్రసిస్త్యం ముందు తరాలకు అందించేందుకు శాశ్వత నిర్మాణ పనులు చేపడతామని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. ఆదివారం మేడారంలో సమ్మక్క సారలమ్మ కోమలి ఫిల్లింగ్ స్టేషన్ పెట్రోల్ బంక్ ను ప్రారంభించారు అనంతరం అమ్మవార్ల గద్దెలను దర్శించుకుని ఆదివాసి ఆచార సంప్రదాయాల ప్రకారం పసుపు కుంకుమలు సమర్పించి మొక్కులు చెల్లించారు పూజా రులు దేవాదాయశాఖ అధికారులు మంత్రిని ఘనంగా సన్మానించారు. సందర్భంగా విలేకరులతో మంత్రి మాట్లాడుతూ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగు మహాజాతరకు ప్రస్తుతం నిత్యం వేలాదిమంది భక్తులు దర్శించుకుంటున్నారని తెలిపారు భక్తుల సౌకర్యార్థం పూజారుల అనుమతితోనే గద్దె ల ఆవరణలో శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టనున్నామని వివరించారు అంతేకాకుండా ఈ జాతర చరిత్ర సజీవంగా భవిష్యత్ తరాలకు అందించాలని లక్ష్యంతో సుమారు 150 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నామని వివరించారు. ప్రస్తుతం జాతర పరిసరాల్లో వివిధ రకాల పనులు సాగుతున్నాయని అన్నారు జంపన్న వాగు పరిసరాల్లో పర్యాటకశాఖ శాఖ అనుమతితో టూరిజం ప్రాంతంగా ఆధునికరించేందుకు ఏర్పాట్లు చేస్తామని అన్నారు అంతేకాకుండా నిత్యం రాకపోకలు ఎక్కువ అవుతున్నందున గద్దెల ప్రాంగణం నుంచి జంపన్న వాగు వరకు రోడ్డు వెడల్పు చేపడతామని తెలిపారు.
దేవతల గద్దెలను దర్శించుకునేందుకు వరుసగా అమ్మవార్ల గద్దెలు నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు ఒకే వరుసలో దేవతల గజ్జలు ఉండటం వలన భక్తులు సునాయాసంగా దర్శించుకోనేందుకు వీలుగా ఉందని పోలీసులు పూజారులు అధికారులు సమక్షంలోనే గద్దెలఆవరణలో శాశ్వత పనులు చేపడతామని వివరించారు ఇందులో ఎలాంటి అపోహాలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటామని వివరించారు. కార్యక్రమంలో ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ గ కళ్యాణి,కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ , గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, ములుగు డి.ఎస్.పి రవీందర్, తాడ్వాయి మండల కమిటీ అధ్యక్షుడు బొల్లు దేవేందర్ ముదిరాజ్, పూజారులు మండల నాయకులు కార్యకర్తలు
తాజా మాజీ ప్రజా ప్రతినిధులు మండల స్థాయి వివిధ శాఖల మనతాధికారులు తదితరులు పాల్గొన్నారు.
………………………………………………
