* తెలుగు రాష్ట్రాల ఎంపీలకు అల్పాహార విందు
ఆకేరు న్యూస్, డెస్క్ : తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఢిల్లీలో అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతంపై వచ్చిన సందర్భంగా తెలంగాణ బీజేపీ ఎంపీలపై మోదీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో ఓవైసీ సోషల్మీడియా కంటే బీజేపీ తక్కువగా ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. కనీసం పార్టీ ప్రతిపక్ష పాత్ర కూడా పోషించడం లేదని, మంచి టీమ్ ఉన్నప్పటికీ సమస్య ఎక్కడ వస్తోందని ప్రశ్నించినట్లు సమాచారం. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలకు మంచి అవకాశం ఉన్నా అందిపుచ్చుకోవడం లేదంటూ మోదీ పేర్కొన్నట్లు తెలిసింది. స్థానిక నేతలు ఆ దిశగా విఫలమవుతున్నారని క్లాస్ తీసుకున్నట్లు తెలిసింది. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండాలని ఎంపీలకు ప్రధాని మోదీ హితవుపలికారు. ఈరోజు ఉదయం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఎంపీలతో సుమారు అరగంట పాటు మోదీ మాట్లాడారు. ఏపీలో చంద్రబాబుతో కలిసి ముందుకు సాగడం మంచి పరిణామమని, ఆయన పాలన కూడా బేషుగ్గా ఉందని కొనియాడారు. చంద్రబాబు పరిపాలనపై కూడా మంచి ఫీడ్ బ్యాక్ వచ్చిందని ప్రధాని కితాబిచ్చారు. తెలంగాణ ఎంపీలకు మాత్రం క్లాస్ తీసుకున్నట్లు తెలిసింది.
…………………………………………..
