
– హైదరాబాద్ మహానగరంలో పూజలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ (Modi) 75వ జన్మదినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపట్టారు. దేశ, విదేశ ప్రముఖులెందరో ఎక్స్ వేదికగా ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. సామాన్యులు సైతం ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ వాట్సప్ స్టేటస్లు పెట్టుకున్నారు. మోదీ పాలనలో కీలక ఘట్టాలను వీడియోల రూపంలో ప్రదర్శించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanthreddy) కూడా ప్రధానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉండగా హైదరాబాద్‌లోని పలు చోట్ల మోదీ నిండు నూరేళ్లు వర్దిల్లాలని పూజలు చేశారు. కుత్బుల్లాపూర్, ఓల్డు బోయినపల్లి, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. బీజేపీ (Bjp) కూకట్పల్లి ఇన్చార్జి మాధవరం కాంతారావు ఆధ్వర్యంలో ఓల్డుబోయినపల్లి శివాలయంలో పరమ శివునికి డివిజన్ బీజేపీ నాయకుడు ఏనుగుల తిరుపతి యాదవ్‌తో కలిసి అభిషేకం నిర్వహించారు. అలాగే, ప్రధాని పుట్టినరోజు సందర్భంగా పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలు కూడా చేపట్టారు.
……………………………………………………