* అంబేద్కర్ వివాదంపై స్పందించిన ప్రధాని
ఆకేరున్యూస్, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి అమిత్ షా.. తన ప్రసంగంలో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్‌ను అవమానించినట్లు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలకు ప్రధాని మోదీ రియాక్ట్ అయ్యారు. ఆయన తన ఎక్స్ అకౌంట్లో స్పందించారు. అంబేద్కర్‌తో లింకున్న అయిదు ప్రాంతాలను తమ ప్రభుత్వం డెవలప్ చేస్తోందన్నారు.ఢిల్లీలోని అలీపూర్ రోడ్డులో అంబేద్కర్ తన చివరి రోజుల్ని గడిపారని, ఆ ప్రాంతాన్ని కూడా డెవలప్ చేస్తున్నట్లు.. లండన్‌లో ఆయన నివసించిన ఇంటిని కూడా స్వాధీనం చేసుకుని డెవలప్ చేస్తున్నట్లు వెల్లడిరచారు. అంబేద్కర్ వల్లే తాము ఇక్కడ ఉన్నట్లు.. అంబేద్కర్‌కు ఇచ్చే గౌరవం, మర్యాదలో లోటు లేదన్నారు. జాతీయ మానవ హక్కుల సంఘం చైర్పర్సన్ ఎంపిక నేపథ్యంలో రాహుల్ గాంధీ, ఖర్గేలతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. అంబేద్కర్ పేరును పదేపదే ప్రతిపక్షాలు లేవనెత్తుతున్నాయని, ఆ పార్టీలకు అదో ఫ్యాషన్ అయినట్లు అమిత్ షా తన రాజ్యసభ ప్రసంగంలో మంగళవారం పేర్కొన్నారు. అంబేద్కర్ పేరుకు బదులుగా దేవుడిని ప్రార్థిస్తే, వాళ్లు స్వర్గానికి వెళ్లేవారు అని షా తెలిపారు. దీన్ని విపక్షాలు తప్పుపట్టాయి. షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి.
……………………………………..