* సుంకాల వివాదం మధ్య ప్రధాని కీలక నిర్ణయం..
ఆకేరు న్యూస్ డెస్క్ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (UNGA) సమావేశానికి హాజరు కావడం లేదు. ఆయన స్థానంలో, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ సెప్టెంబర్ 27న భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి ప్రసంగిస్తారు. UNGA 80వ సెషన్లో ఉన్నత స్థాయి సాధారణ చర్చ సెప్టెంబర్ 23 నుండి 29 వరకు జరుగనుంది. సాంప్రదాయకంగా బ్రెజిల్ సెషన్‌ను ప్రారంభిస్తుంది. తరువాత అమెరికా ఉంటుంది. ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన వక్తల జాబితాలో ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్ ఇద్దరి పేర్లు కూడా ఉన్నాయి. ఈ సెషన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు, పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ పేరు కూడా చేర్చారు.కాగా, రష్యా నుండి చమురు కొనుగోలు చేసినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై జరిమానా విధించారు. భారత్-అమెరికా మధ్య సుంకాల విషయంలో వివాదాలు తలెత్తిన నేపధ్యంలో UNGAకు హాజరు కాకూడదని ప్రధాని మోడీ నిర్ణయం తీసుకున్నారు.
……………………………………..
