మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ లాండ్ స్లైడ్ జరిగిన వయనాడ్ ప్రాంతాన్ని ఆర్మీ యూనిఫామ్‌లో సందర్శించారు. మోహన్‌లాల్ , ఆర్మీ గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదా కలిగి ఉన్నారు.
* వరద బాధితులకు అండగా స్వయంగా రంగంలోకి..
* గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో సహాయక చర్యలు
ఆకేరు న్యూస్ డెస్క్ : రీల్ హీరో కాదు.. రియల్ హీరో అనిపించుకున్నారు.. కేరళ నటుడు మోహన్‌లాల్ ( Mohan Lal ) వయనాడ్ విపత్తులో చిక్కుకున్న వరద భాదితులకు అండగా నిలిచేందుకు నేరుగా రంగంలోకి దిగారు. ఆర్మీతో కలిసి రెస్యూ ఆపరేషన్‌లో భాగమయ్యారు. స్వయంగా గ్రౌండ్లోకి దిగి గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఇప్పటికే సీఎం సహాయ నిధికి రూ. 25 లక్షల విరాళం అందించిన మోహన్‌లాల్, తాజాగా స్వయంగా రంగంలోకి దిగారు. కోజికోడ్ నుంచి రోడ్డుమార్గంలో వయనాడ్‌కి వచ్చిన మోహన్‌లాల్… ఆర్మీ బేస్ క్యాంప్‌లో సైనికులను కలిశారు. ఆ తర్వాత ఆర్మీతో కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. తాత్కాలిక బ్రిడ్జ్‌ల నిర్మాణం, బాధితులకు సహాయం చేయడంలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా మోహన్ లాల్ మాట్లాడుతూ.. దేశంలో జరిగిన ఘోర విపత్తుల్లో వయనాడ్ విధ్వంసం ఒకటన్నారు. సంఘటన స్థలానికి వచ్చి చూస్తే ఏ స్థాయిలో నష్టం జరిగిందో అర్ధమైందన్నారు. మోహన్ లాల్ స్వయంగా రంగంలోకి దిగి వరదా బాధితులకు అండగా నిలవడంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
————————————————–
Please tell us what is wrong. Your report will be sent to the website team.
