సీఎం చంద్రబాబు నాయుడు
* అక్రమాలకు పాల్పడిన అధికారులను వదిలేదు లేదు
* ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
ఆకేరు న్యూస్, మంగళగిరి : గత ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైన వ్యవస్థలను వంద రోజుల్లో గాడిన పెడతానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ( Chandrababu Nayudu ) ఆరోపించారు. రెవెన్యూ శాఖ నిర్వీర్యానికి మదనపల్లె ఘటనే ఉదాహరణ అని తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి ఆయన వినతులు స్వీకరించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. రెవెన్యూ సంబంధిత సమస్యలపైనే అధికంగా ఫిర్యాదులు అందాయని తెలిపారు. వినతులు అన్నింటినీ పరిష్కరించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి మండలంలోనూ ఓ భూకుంభకోణం వెలుగు చూస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. రికార్డులను కూడా తారుమారు చేశారని పేర్కొన్నారు. రీసర్వే అస్తవ్యస్తంగా జరగడం వల్లే ప్రజలకు ఇబ్బందులు తప్పటం లేదని స్పష్టం చేశారు. ప్రతి జిల్లాలో రెవెన్యూ సంబంధిత ఫిర్యాదుల స్వీకరణకు ప్రాధాన్యమిస్తామని చంద్రబాబు తెలిపారు. రెవెన్యూ సమస్యలకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అక్రమాలకు పాల్పడిన అధికారులను వదిలేది లేదని హెచ్చరించారు.
———————————————
Please tell us what is wrong. Your report will be sent to the website team.
